మెదక్ జిల్లా, జులై 22:
లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం ఉదయం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరులో ఓ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.