కామారెడ్డి జిల్లా లో దోపిడీ దొంగల బీభత్సం

7/26/2023 11:48:53 AM

కామారెడ్డి జిల్లా:జులై 26
జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బీర్కూర్ మండలం రైతు నగర్‌లో దంపతులను హత్య చేశారు. కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను దారుణంగా హత్య చేసి చంపారు. మంగళవారం రాత్రి వెనకవైపు నుంచి ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. నారాయణ భార్యను చీరతో ఉరేసి దుండగులు చంపారు. నారాయణను పదునైన ఆయుధంతో కొట్టి చంపారు. దోపిడీ దొంగల పనే అని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.....

Name*
Email*
Comment*