*గాలిస్తున్న గజ ఈతగాళ్లు
రంగారెడ్డి జిల్లా:జులై 26
వాగులో దూకి ఓ మహిళ గల్లంతు అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారి పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది.
కొందుర్గ్ మండలం అగిరాల గ్రామానికి చెందిన గుమ్మడి నిర్మల (35) అని స్థానికులు గుర్తించారు. వాగులో దూకి గల్లంతు అయిన మహిళ రోజు కూలీగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయ్యవారి పల్లి గ్రామానికి ఎందుకు వచ్చింది అని వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ వున్న స్థానికులు చూసీ గ్రామ సర్పంచ్ లక్ష్మి రమేశ్ కు తెలపడంతో సర్పంచ్ పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవకీ సంఘటనా స్థలానికి చేరుకునీ పరిస్థితి పై ఆరా తీశారు. ఫైర్ డిపార్ట్ మెంట్, పోలిసులు, గజఈతగాళ్ల సాయంతో మహిళ ఆచూకీ కోసం వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మల కొట్టుకుపోయిన వాగు గుండా గ్రామస్తులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వాగులో కొట్టుకుపోయిన నిర్మలకు భర్త, ఓ కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. నిర్మల బంధువులు వాగు వద్దకు చేరుకొని రోదిస్తున్నారు. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.