సీతంపేట లో ధర్నా... పలువురు అరెస్ట్

9/9/2023 1:02:30 PM


సీతంపేట,ఎక్స్ ప్రెస్ న్యూస్: చంద్రబాబు నాయుడు ని శనివారం అరెస్ట్ చేసిన నేపథ్యం లో పాలకొండ నియోజకవర్గ నాయుకురాలు పడాల భూదేవి  ఆధ్వర్యంలో టిడిపి నాయకులు సీతంపేట లో ధర్నా చేపట్టారు. హై స్కూల్ నుంచి బస్టాండ్ కు నినాదాలు చేస్తూ ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. అయితే స్టేషన్ లో బైటాయించి ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి సీనియర్ నాయకులు బిడ్డిక దమయంతి నాయుడు, మాజీ ఎంపీపిలు సవర మాలయ్య, ఆరిక లచ్చుమయ్య,మాజీ జెడ్పీటీసీ పాలక రాజబాబు,టిడిపి మండల కన్వీనర్ సవర మొఖలింగం, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ లు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*