చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అనకాపల్లి, కశింకోట, మునగపాకలో ధర్నాలు

9/9/2023 1:24:45 PM

 అనకాపల్లి ఎక్స్ ప్రెస్ న్యూస్ సెప్టెంబర్ 9:  అనకాపల్లి నంద్యాలలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అదేశాల మేరకు అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల జంక్షన్ ( నెహ్రు చౌక్ జంక్షన్) వద్ద శాంతియుతంగా నిరశన తెలియజేస్తున్న అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులను అరెస్టు చేసి పోలిసు స్టేషనుకు తరలించారు. అంతకుముందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం వద్ద నుండీ నిరశనగా నెహ్రు చౌక్ జంక్షన్ కు చేరారు. కశింకోట మండలం తాళ్లపాలెం మూడురోడ్ల జంక్షన్ వద్ద కశింకోట మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు శాంతియుతంగా నిరశన తెలియజేసారు . తాళ్లపాలెం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఉల్లింగల రమేష్, అచ్చెర్ల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నాయినంశెట్టి రమణారావు. మాజీ సర్పంచ్ కర్రి దుర్గు నాయుడు, కశింకోట మండల తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి /గంటా యువసేన కన్వీనర్ జెర్రిపోతుల నూకునాయుడు.మాజీ డీసీసీబీ డైరెక్టర్ అండ్రా ప్రసాద్,  మాజీ ఎంపీటీసీ హనుమంతు సత్తిబాబు. మాజీ సర్పంచ్ లు పచ్చికోర విజయ్, ద్వారపూరెడ్డి సత్తిబాబు, చూచికొండ ప్రసాద్, మూర్తులు. ఎస్ ఎం నాయుడు,  లోవకృష్ణ, కడియాల ప్రసాద్, బుజ్జి, చింతల పాలెం టీడీపీ అధ్యక్షులు కోన రమణ, మోసయ్యపేట టీడీపీ అధ్యక్షులు వెంకటప్పారావు. నాగేశ్వరావు. మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులను పాల్గొన్నారు. అనకాపల్లి, కశింకోట మండలాలలో శాంతియుతంగా నిరశన తెలియజేస్తున్న అనకాపల్లి, కశింకోట మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులను అరెస్టు చేసి కశింకోట, అనకాపల్లి టౌన్ , రూరల్ పోలిసు స్టేషనుకు తరలించారు.

Name*
Email*
Comment*