. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి
అమరావతి, ఎక్స్‌ప్రెస్ న్యూస్ ప్రతినిధి:
చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. ’ఈ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుంది...’’ అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో పురందేశ్వరి ట్వీట్ పైన నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ సహకారం లేకుండానే చంద్రబాబు అరెస్ట్ నిర్ణయం జరిగిందా, చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు స్పందించలేదని మరి కొందరు పురందేశ్వరిని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత తరహాలో ఎందుకు స్పందిస్తున్నారంటూ వైసీపీ మద్దతు దారులు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ మద్దతు లేదంటే నమ్మలేమని మరి కొందరు పోస్టింగ్ లు చేస్తున్నారు.