శ్రీరామ్, కారుణ్య చౌదరి, బేబీ సాయి తేజస్విని ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సుమన్‌బాబు దర్శకుడు. ఎన్.వి.వి.సుబ్బారెడ్డి నిర్మాత. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న సినిమా విడుదల కానుంది.
సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను అగ్రనిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. 45 నిమిషాల గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, బేబీ తేజస్విని నటన సినిమాకు ప్రధానబలమని, యువతరం మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని దర్శకుడు తెలిపారు.