తహసీల్దార్ దారుణ హత్య

2/3/2024 6:36:21 AM


  • నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు

విశాఖపట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్ : విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇనుప రాడ్డులతో బలంగా తలపైన కొట్టి దుండగులు పరారయ్యారు. అపార్టుమెంటు సెల్లార్ లోని  సీసీటీవీ ఫుటేజ్ లో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ రవి శంకర్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లతో పరిశీలిస్తున్నారు. తహసీల్దార్ రమణయ్యకు భార్య,  పాప, బాబు ఉన్నారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన వారు. విధుల్లో చేరి పదేళ్లు అవుతోంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుండి కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్ గా సంభాషించారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి  పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను వెంటనే అపోలో హాస్పిటల్ కు బంధువులు తరలించారు. హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ మృతి చెందారు. కొమ్మాదిలోని ఎస్టీబీఎల్సి సినీ థియేటర్ వెనక ఉన్న చరణ్ క్యాస్టల్స్ అపార్ట్మెంట్లో ఐదో అంతస్తులు నివాసం  రమణయ్య ఉంటున్నారు. ల్యాండ్ ఇష్యూకు సంబంధించి గొడవ జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. 

Name*
Email*
Comment*