విశాఖపట్నం: తహసీల్దార్ సనపల రమణయ్య మర్డర్ హత్య కేసులో పురోగతి కనిపించింది. కొన్ని గంటల వ్యవధిలోనే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన వ్యక్తి కోసం 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన విశాఖ సీపీ..
హత్యకు ముందు తహసీల్దార్ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు వెళ్లిన తరువాత మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వాగ్వాదం.. ఆపై దారుణ హత్య..లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులు
స్క్రోలింగ్...
👉 తహశీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం... ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి బొప్పరాజు & చేబ్రోలు కృష్ణ మూర్తి
👉 రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం..
👉 హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి..
👉 ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
👉 తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
👉 అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలి.
👉విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పైన విధి ఆటంకాలు, దాడులకు సంబంధించి, దోషులపైన చర్యలు తీసుకొనుటకు కఠినమైన చట్టం తీసుకురావాలి.
👉రమణయ్య, తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఈ రోజు 26 జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులందరు నల్ల బాడ్జెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నాము