డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు

2/6/2024 8:59:30 AM

*నియంత్రణ కు సిద్ధం అయిన కేంద్రం...*

*నిబంధనలు 2021 కఠినంగా అమలు కు రంగం సిద్ధం...*

*నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ...*

*పిర్యాదు లేకుండానే పోలీస్ చర్యలకు అవకాశం...*

విశాఖపట్నం-ఫిబ్రవరి - 5: డిజిటల్ మీడియా ముసుగు లో సోషల్ మీడియా వేదిక గా కొంతమంది చేస్తున్న అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ (ఆర్ ఎన్ ఐ )* అప్లికేషన్ వెబ్ సైట్ ఆపు చేసింది. పలు కీలక మార్పులు ప్రతీ పాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరింది. ఆర్ ఎన్ ఐ అనుమతి కఠినతరం చేశారు. అది విధంగా ఉండగా మంత్రి త్వ శాఖ లో ప్రింట్, ఎలక్ట్రానిక్ లాగా డిజిటల్ మీడియా విభాగం నెలకొల్పడం జరిగింది. అధికారులను నియమించారు. ఈ విభాగంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 61 డిజిటల్ మీడియా సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రలలో మొత్తం మూడు దరఖాస్తులు వచ్చినట్లు, అవి విచారణ దశలో ఉన్నట్లు గా సమాచారం. 2021 లో కేంద్రం డిజిటల్ మీడియాకీ చట్ట బద్దత కల్పిస్తూ కొన్ని నియమాలు రూపొందించింది. దీని ప్రకారం అడ్డగోలుగా వ్యవహరించకుండా తమని తాము మీడియా సంస్థలు నియంత్రణ చేసుకోవాలి. నిబంధన ల అతిక్రమణ తీవ్ర రూపం లో ఉంటే ఎటువంటి
ఫిర్యాదు లేకుండా స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి చర్యలు తీసుకొవచ్చు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు వర్తించే ప్రతీ నిబంధన డిజిటల్ కీ వర్తిస్తుంది. కేంద్రం లోని సమంధిత విభాగం లక్ష ల్లో జరిమానా, జైలు శిక్ష ప్రతిపాదన చెయ్య వచ్చు. డిజిటల్ మీడియా కార్యాలయం, కార్య నిర్వాహకుడు రెండు భారతదేశం అడ్రెస్ తో ఉండాలి. ఆమేరకు వివరాలతో బోర్డులు ఉండాలి. స్వీయ నియంత్రణ కమిటీ, ఫిర్యాదుల కు ఫోన్ నెంబర్, ప్రతీ ఆన్లైన్ కంటెంట్ (వార్త ) కీ జోడించాలి. ఇలా అనేక నిబంధనలు ఉన్నాయి. ఎవరు పడితే వారు, కనీసం అడ్రెస్ కూడా సరిగా లేని వారు, యూట్యూబర్ లు కొంతమంది మాది ఛానల్, డిజిటల్ మీడియా అని ప్రకటనలు ఇవ్వడం, ఆన్లైన్ లో అడ్డగోలుగా కంటెంట్ (సమాచారం) పెట్టటం చేస్తున్నారు. డిజిటల్ మీడియా పేరుతో సంఘాలు వెలిసాయి. సోషల్ మీడియా పరిధిలోకి పైవి వస్తాయి. ఆ సోషల్ మీడియా దుర్వినియోగం అరికట్టటం కోసం కేంద్రం డిజిటల్ ఫ్లాట్ ఫాం అనేది మీడియా విభాగంలోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. కరోనా కాలం నుండి డిజిటల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది. దానిని కొందరు సోషల్ మీడియా వాళ్ళు డిజిటల్ మీడియా ముసుగు వేసుకొని మొత్తంగా జర్నలిస్ట్ వృత్తి స్థాయిని దిగజారుస్తున్న నేపథ్యంలో కేంద్రం డిజిటల్ మీడియా నిబంధనలు అమలు కొంత వరకు ప్రయోజనం గా ఉండే అవకాసం ఉంది.

Name*
Email*
Comment*