కిలో RS. 29కే వచ్చే భారత్‌ రైస్‌

2/7/2024 6:17:21 AM

*కేంద్ర ప్రభుత్వం అద్వర్యంలో అమ్మకాలు 

న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్: 
కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో తక్కువ ధరకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇలా కొనుగోలు చేయొచ్చు..
ఈ భారత్ రైస్ కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్ళాలి. ఇక్కడ భారత రైస్ తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే సగానికి పైగా తక్కువ ధరకు బియ్యం లభిస్తుండడం, అందులోనూ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Name*
Email*
Comment*