వైసీపీ నాయకుడు శంకర్ పై దాడి

2/9/2024 8:37:04 PM

శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్ల  మండల వైసీపీ వైస్ ఎంపీపీ ప్రతినిధి జరుగుల శంకర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు‌‌ తన ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయన్ను  ఎచ్చెర్ల సమీపంలోని  ట్రిపుల్  ఐటీ  వద్ద  దారిలో కాపు కాసి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ ను  శ్రీకాకుళం లోని మొడికవర్  ఆసుపత్రికు తరలించారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వైసీపీ అసమ్మతి నాయకుడు శంకర్రావు పై దాడి ఘటనతో ఎచ్చెర్ల నియోజవర్గ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

Name*
Email*
Comment*