* క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
* సైబర్ నేరగాళ్లు మోసాలు
* ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు
*ఇలాంటివి నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ
హైదరాబాద్, ఎక్స్ ప్రెస్ న్యూస్: సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే.
ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది..