భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎక్స్ ప్రెస్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఆంధ్ర నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని శనివారం బూర్గంపాడు ఎస్ ఐ రాజకుమార్ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఇసుక రవాణాకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని,ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.