"వి లవ్ బ్యాడ్ బాయ్స్"

2/15/2024 10:14:12 AM


వేలెంటైన్స్ డే సందర్భంగా
ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నూతన నిర్మాణ సంస్ధ "బి.ఎమ్.క్రియేషన్స్" బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం 
"వి లవ్ బ్యాడ్ బాయ్స్" (We love Bad Boys). రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ లభించింది. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ వేలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణం. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నేటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్ కు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు!!

"రఘు కుంచె"తో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ కు పాటలు: భాస్కరభట్ల - శ్రీమన్నారాయణాచార్య (విరాట్) గానం: రఘు కుంచె - గీతా మాధురి - లిప్సిక - అరుణ్ కౌండిన్య, మనోజ్ శర్మ కుచి, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎడిటింగ్: నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్: ఆనంద్ కొడవటిగంటి, సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు, సమర్పణ: శ్రీమతి పప్పుల వరలక్ష్మి, నిర్మాత: పప్పుల కనకదుర్గారావు, నిర్మాణం: బి.ఎమ్.క్రియేషన్స్, రచన - దర్శకత్వం: రాజు రాజేంద్రప్రసాద్!!

Name*
Email*
Comment*