సిరిపురం తేజేశ్వరరావు వైపు జనసేన పార్టీ చూపు

2/16/2024 11:53:29 PM


పాతపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 16: పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. ఒకపక్క వలస రాజకీయ నేతలు పదవులు పొందిన తరువాత నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడుతున్నారు. మరో పక్క కుటుంబ వారసత్వ రాజకీయం ఈ రెండిటి నేపథ్యంలో అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్న  నియోజకవర్గం పాతపట్నం.  ఇక్కడ రెండు ప్రధాన పార్టీల్లో గ్రూపులతో గందరగోళంగా తయారయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా పాతపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నా జెండా ... ఆజెండా అంటూ నినాదంతో సంవత్సరమున్నర కాలంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు ప్రజా అభ్యర్థిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు. ఈ నియోజకవర్గంలో స్థానికుడు విద్యావంతుడు స్నేహశీలి స్థానికంగా బంధుగణం, మిత్రగణం కలిగినటువంటి సిరిపురం తేజేశ్వరరావు వైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు సమాచారం. జనసేన టికెట్ ఇచ్చి ఈసారి సిరిపురం తేజేశ్వరరావును ఎమ్మెల్యేగా నిలబెట్టాలని జనసేన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఇటు అధికార పార్టీకీ చెందిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. దానికి కారణం లేకపోలేదు. నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం క్రింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, వంశధార రిజర్వాయర్ నుంచి పక్క నియోజకవర్గాలుకు తాగునీరు తరలిపోతున్న నియోజకవర్గంలో తాగడానికి మంచినీరు లేక అనేక గ్రామాలకి నేటికీ తాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతికీ  అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, ఇటు ప్రజల్లో కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. తెలుగుదేశం పార్టీలో కలమట వర్గం , ఎంజీఆర్ వర్గం రెండుగా చీలిపోయి పార్టీ మనుగడే కష్టతరంగా తయారైందని దేశం నాయకులు అయోమయ స్థితిలో ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున టిక్కెట్టు ఒక వర్గానికి వస్తే మరో వర్గం పూర్తిగా సహకరించదని భావిస్తూ తెలుగుదేశం ఒక నిర్ణయానికి వస్తున్నట్లు పాతపట్నం ఈసారికి జనసేనకు వదిలివేయాలని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పాతపట్నం వైపు చూస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సిరిపురం తేజేశ్వరరావును సంప్రదించి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరిందనీ రాజకీయ వర్గాల ద్వారా సమాచారం. అయితే సిరిపురం తేజశ్వరరావు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి మొగ్గు చూపుతున్న తరుణంలో  తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం సీటును జనసేన కైవసం చేసుకుంటుందని కేంద్ర కార్యాలయం నుంచి విశ్వసనీయ సమాచారం అందుకుంది . పాతపట్నం నియోజకవర్గం జనసేన కార్యకర్తలు,నాయకులు. పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ అయితే ఉంది కానీ పార్టీని ముందుండి నడిపించే సమర్ధుడైన నాయకుడు లేకపోవడం ఈ పార్టీ ఇన్నాళ్లు మనుగడ సాగించలేకపోయింది. పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సిరిపురం తేజేశ్వరరావు అయితే సరైన అభ్యర్థిని భావించి జనసేన పార్టీ తన అభ్యర్థత్వాన్ని ప్రకటించే యోజనలో ఉందని రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికి సరైన నాయకుడు దొరికాడని పార్టీ భావిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాతపట్నం శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కలమట, ఎంజీఆర్ రెండు వర్గాలుగా చీలిపోయిన రెండు వర్గాల్లో కార్యకర్తలు నినాదాలు చేస్తున్న సమయంలో కార్యకర్తలను నిలువరించే సమయంలో ఆయన టిక్కెట్ విషయంలో పెద్దలు నిర్ణయిస్తారు. పొత్తు ధర్మం పాటించాలని ఎవరికి టిక్కెట్ వస్తే వారికి మిగిలిన వారు సహకరించి ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. ఈ పరిణామాలన్నింటినీ జనసేన పార్టీ గమనించి పాతపట్నం నియోజకవర్గానికి సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు సరైన అభ్యర్థిని భావించి రానున్న ఎన్నికలలో అభ్యర్థిగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు ఆ నోట ఈ నోట వినిపిస్తున్న మాట. నియోజకవర్గ ప్రజల్లో కూడా విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సిరిపురం వైఫై మగ్గుచూపుతున్న తరుణంలో జనసేన పార్టీ ఈ టిక్కెట్ను ఈసారి తన ఖాతాలో వేసుకోవాలనటువంటి ఈ నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తున్నటువంటి సమాచారం.

Name*
Email*
Comment*