ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా! :గిడ్డి సత్యనారాయణ

2/22/2024 8:44:30 PM


పి.గన్నవరం ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి;22: పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో దొమ్మేటి సాయి కృష్ణ అధ్యక్షతన జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పి. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిడ్డి సత్యనారాయణ సమక్షంలో సుంకర రామదాసు నాయుడు ద్వారా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 50 మంది జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో ప్రవేశించారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన తరిమికొట్టాలని, ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేసిన, రాష్ట్రంలో దోపిడి నాయకులు రౌడీ నాయకులు పెట్రేగిపోతున్నారని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి  కృషి చేస్తానని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగినీడి వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రెటరీ కుమార్, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు అంకిశెట్టి ప్రసాద్, చిన్నం విజయరావు, అరెగల సూరిబాబు, మైపాల తాతాజీ, జనసేన పార్టీ నాయకులు మరియు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Name*
Email*
Comment*