వయోజన విద్యా శిక్షణా కార్యక్రమం

2/22/2024 8:46:23 PM

*ముఖ్య అతిధిగా 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు

కొత్త గాజువాక ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22; లే పీపుల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ (లీప్) స్వచ్చంద సేవా సంస్థ వారు నిర్వహించిన వయోజన విద్యా కార్యక్రమాల శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్బంగా ముఖ్య అతిధిగా గంట్యాడ మండల ఎంఈఓ  విశ్వనాధం, 65వ వార్డు కార్పొరేటర్ మూర్తి  తదితరులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం స్థానిక బీసీ రోడ్ లో గల ఫంక్షన్ హల్ లో 19 నుండి 22 వరకు 40 మంది కార్యకర్తలకు మరియు 20 మంది వాలంటీర్లుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ వయోజన విద్య ద్వారా వారితో పాటు వారి కుటుంబం  మొత్తం వెలుగు బాటలో పయనించటానికి దొహద పడుతుందని తెలియజేసారు.  కార్పొరేటర్ మూర్తి  మాట్లాడుతూ  వయోజనలు కోల్పోయిన విద్య ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకునే అవకాశం పొందగలుగుతారని అభినందించారు. సి ఆర్ పి సత్యన్నారాయణ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేయుటకు వచ్చిన కార్యకర్తలను అభినందించారు.  ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభం నుండి నేషనల్ డైరెక్టర్ జాన్సన్, పర్యవేక్షించి అందరిని ప్రోత్సహించారు.  ఈ సంస్థ డైరెక్టర్ సిహెచ్ పాల్  మాట్లాడుతూ 40 గ్రామాలకు అవసరమైన బోధనా పరికరాలను రి రైట్ లైఫ్ సంస్థ వారి సహాయ సహకారంతో ఉచితంగా అందజేయబడుచున్నావని తెలియజేసారు.  విద్యతో పాటు సామజిక అభివృద్ధి వ్యక్తిగత వికాసానికి అవసరమైన తరగతులను కూడా అయా గ్రామాలలో నిర్వహిస్తారని మరియు ఎందుకుగాను స్థానిక ప్రభుత్వ సహకారంతో అధికారులకు సహకరించులాగున కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగినది.  ఈ కార్యక్రమమునకు స్థానిక పెద్దలు పాస్టర్ షణ్ముఖ రవికుమార్, కావలసిన ఏర్పాట్లను సమకూర్చారు. కార్యక్రమంలో సురేఖ, ఉదయ్, జి ఎస్ రాజు, ఎం టి రాజు, ఎస్. ప్రేమ్, విఆర్ఓ రవి తేజ తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*