గాజువాక క్రిస్టియన్ అండ్ పాస్టర్ ఫెలోషిప్ నూతన కార్యవర్గం ఎన్నిక

2/22/2024 8:49:13 PM

*ముఖ్యఅతిథిగా హాజరైన గాజువాక సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు ( చందు )

గాజువాక ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22; గాజువాక 66 వార్డులో  *గాజువాక క్రిస్టియన్ యండ్  పాస్టర్ ఫెలోషిప్*  ఎన్నికైన సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గాజువాక సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు ( చందు ) నూతన కార్యవర్గంగా ఎన్నికైన గౌరవ అధ్యక్షులు సుధీర్ కే మహంతి, గౌరవ సలహాదారు డి యస్ యన్ రాజు, అధ్యక్షులు కేత అప్పారావు ( పీటర్ ), ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు, సహాయ కార్యదర్శి కేత సుధాకర్, ఎన్నికైన వారికి ఉరుకూటి చందు  శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో గాజువాక క్రిస్టియన్ యండ్ పాస్టర్ ఫెలోషిప్ నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అలాగే సభ్యులకు ఏ సమస్య వచ్చిన సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటాను అని తెలియజేశారు అలాగే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో దైవజనులు ఇమ్మానుయేలు మాను, సాల్మన్ రాజు, అరుణ్ కుమార్, పాల్ డేవిడ్, ఏసు పాదం, కిషోర్ కుమార్, లోక రాజు ఎలీషా దివ్య రాణి,రామారావు,తిమోతి తదితరులు పాల్గొన్నారు

Name*
Email*
Comment*