రాజమండ్రి బ్రీడ్స్ డాగ్ షో ఛాంపియన్ షిప్ - RBC

2/22/2024 8:51:00 PM

రాజమహేంద్రవరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్: జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డాగ్ షో పోటీలు ఈనెల 25వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతాయని బౌ అండ్ కౌ షోరూం నిర్వాహకులు తరుణ్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ లోని ఐరన్ హిల్ ఎదురుగా ఉన్న దారా గ్రౌండ్స్ లో రాజమహేంద్రవరం బ్రీడ్స్ చాంపియన్ షిప్ డాగ్ షో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెట్రో సిటీస్లను ఈ డాగ్ షోలు నిర్వహిస్తున్నారని అయితే రాజమహేంద్రవరంలో ఎందుకు నిర్వహించకూడదని ఉద్దేశంతో ఈ డాగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం లో డాగ్ షో నిర్వహించలేదని, అయితే బౌ అండ్ కౌ సంస్థ ద్వారా నిర్వహించాలని ఉద్దేశంతో బయటకు వచ్చామని వివరించారు. ఫిబ్రవరి 25న నిర్వహించబోయే డాగ్ షో పోటీలలో వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి భీమవరం, విజయవాడ, విశాఖపట్నం, తదితర మెట్రో సిటీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు. సింగిల్ డాగ్ తో పాటు ఇద్దరికీ ప్రవేశం ఉంటుందని ఎంట్రన్స్ ఫీజుగా 300 రూపాయలు రిజిస్ట్రేషన్ పేజీలు జరుగుతుందని తెలిపారు. ఏదో సంపాదించాలని వ్యాపార దృక్పథంతో కాకుండా డాగ్ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజమహేంద్రవరంలో వీధుల్లో సుమారు 20 వేలు వీధి డాగ్స్ తిరుగుతున్నాయని వాటిలో కొన్ని ప్రమాదాల బారినపడి కాళ్లు విరగ్గొట్టుకుంటున్నాయని, కొన్ని డాగ్స్ చర్మవ్యాధులతో బాధపడుతున్నాయని వీటికి చికిత్స అందించేందుకు ఈ డాగ్ షో ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేస్తామని వివరించారు. ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించబోయే డాగ్ షోలో డాగ్స్ లో వివిధ రకాల స్టాల్స్ తో పాటు డాగ్స్ కు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇతర స్టాల్స్ కూడా ఉంటాయని తెలిపారు.  డాగ్స్  కు అత్యవసర చికిత్స అందించేందుకు  జంతు సంబంధిత వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.  ఈ డాగ్ షో కు  జడ్జిగా దినేష్ గౌడ్ వ్యవహరిస్తారని తెలిపారు.ఈ డాగ్స్  షోలో పాల్గొనేవారు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు. రిజిస్ట్రేషన్ ల కొరకు ఫోన్ 8555845656. 8500845656. 7981888191. నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ డాగ్ షో నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు పీజీ వెంచర్స్, ఎస్ యు బి నిధి లిమిటెడ్, ప్రోఫిడ్ జెనిక్స్ తదితర సంస్థలు స్పాన్సర్స్ చేస్తున్నాయని వివరించారు.విలేకర్ల సమావేశంలో బౌ అండ్ కౌ సంస్థ నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్ జె వై గణేష్, ఆర్సి స్టూడియో అధినేత చింతా రాజు, ఎన్ కాంటెడ్ కేఫీ అధినేత దివ్య, శ్రీనివాస్, అవినాష్, దినేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*