పాత్రికేయులు పై దాడి అమానుషం

2/22/2024 8:55:48 PM

తెలుగుదేశం నేత పీరికట్ల విఠల్ 

పలాస, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22 :- ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ పిల్లారైన పాత్రికేయ వ్యవస్థపై దాడి విచారకరం. ఈ వైసిపి ప్రభుత్వంలో పాత్రికేయ వ్యవస్థను అనగతొక్కాలని చూస్తున్నారు. కొన్ని చానల్స్ ఒక పత్రికా చేతుల్లో పెట్టుకొని అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈనాడు, నిజాలు నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతి పత్రికలను అనగతొక్కలని చూస్తున్నారు. దీనికి నిదర్శనం మొన్న ఆంధ్రజ్యోతి పాత్రికేయునీ పై దాడి, నిన్న పత్రికా కార్యాలయంపై దాడి, దీన్ని ప్రజలు ప్రజాస్వామ్య వాదులు ఖండించల్సిన అవసం ఉంది. ఎక్కడా లేని వికృతమైన చర్యలు ఈ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత బాధాకరం. ప్రశ్నించే ప్రతీ వ్యవస్థపై దాడులు చేసి ప్రజలను భయ పెట్టీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

Name*
Email*
Comment*