చదువుతోనే వికాసం

2/22/2024 9:03:22 PMసోంపేట ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22; చదువుతోనే మనిషి సంపూర్ణంగా వికాసం చెందుతాడని ,విధ్యార్థిని ,విద్యార్థులు ఇష్టంగా చదివి పరీక్షలలో మంచి విజయాలు పొందాలని సోంపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి మోహనరావు పేర్కొన్నారు .ప్రభుత్వ జూనియర్ కళాశాల,ఆవరణలో ఫేర్ వెల్ ఫంక్షన్ , వీడ్కోలు సభ గురువారం ఘనంగా నిర్వహించారు . ప్రిన్సిపాల్   మోహన్ రావు  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల కంచిలి ప్రిన్సిపాల్ శ్రీమతి పి రజిని కుమారి, బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం కామేశ్వరరావు ,  గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం దామోదర్ రావు ,తదితరులు మాట్లాడారు.  పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏ విధంగా సహనంతో ఎదుర్కోవాలి క్రమశిక్షణతో ఎలా ఉండాలని వివరించారు .  అనంతరం వక్తలను సన్మానించారు.  పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్  చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.  విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి .  ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,  సిబ్బంది విద్యా కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు

Name*
Email*
Comment*