మంత్రి జన్మదిన వేడుకల్లో పోటెత్తిన అభిమానం

2/22/2024 9:05:40 PMసోంపేట ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 22: రాష్ట్ర మత్స్య ,పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జన్మదిన వేడుకలు గురువారం ఆయన నివాస గృహం ప్రగతిభవన్  సమీపంలో పండగ వాతావరణం లో జరిగింది. గురువారం ఉదయం నుంచి పార్టీ కార్యకర్తలు,, అభిమానులు వేల సంఖ్యలో చేరుకొని పుష్పగుచ్చాలు, మిఠాయిలు తినిపించి ఆప్యాయంగా కౌగిలించుకుంటూ మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వైకాపా పార్లమెంటు బాధ్యుడు పేరాడ తిలక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ దంపతులతోపాటు ఇచ్చాపురం , కంచిలి, సోంపేట, కవిటి వజ్ర కొత్తూరు , మందస  ,పలాస నందిగాం  ,టెక్కలి , పాతపట్నం , శ్రీకాకుళం నరసన్నపేట  తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలిచ్చారు .  వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన గేట్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మళ్లీ రాజన్న రెండోసారి పలాస పగ్గాలు చేపట్టాలని అభిమానులు ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.మీ అందరి ఆదరాభిమానాలు ,భగవంతుడు ఆశీస్సులు తో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలస్తానన్న నమ్మకం కలిగిందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

Name*
Email*
Comment*