అట్టహాసంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

4/22/2024 7:58:29 PMభీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్ 22;భీమిలిలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హాసిని వర్మ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హాసిని వర్మకు మద్దతు తెలియజేశారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం, మధురవాడ, తదితర ప్రాంతాల నుంచి  ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో హాసిని వర్మ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా హాజరయ్యారు. తీన్ మార్, కోలాటాలతో  అట్టహాసంగా  తాళ్ళవలస నుండి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఆర్. డి. ఓ. కార్యాలయంలో  హాసిని వర్మ తన   నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హాసిని వర్మ వెంట విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గాదం మహేష్, స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, డిసిసి అధ్యక్షుడు గొంప గోవిందరాజు, పెందుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి పిరిడి భగత్, సిపిఎం నాయకుడు ఆర్. ఎస్. ఎన్. మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్ల వెంకటరావు, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Name*
Email*
Comment*