సమ్మర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన గంటా రవితేజ

4/22/2024 8:02:24 PM


భీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్ 22;ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ గుమ్మడివానిపాలెంలో ఐపీఎల్ టోర్నమెంట్ ను గంటా రవితేజ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం శొంఠ్యాం ఉపసర్పంచ్ కోరాడ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. టోర్నమెంటుకు మండలంలో 8 టీంలు నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సమ్మర్ ప్రీమియర్ లీగ్ పేరిట ఐపిఎల్ ను గ్రామంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో  ఐపిఎల్ టోర్నమెంట్ ను ఘట్టమనేని ఎస్టేట్స్ యజమాని ఘట్టమనేని చంద్రబోస్ తో కలిసి గంటా రవితేజ ప్రారంభించారు.ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి,శారీరక ధారుఢ్యానాకి క్రీడలు దోహదపడతాయన్నారు. అలసటను జయిస్తాయన్నారు. క్రీడా మైదానానికి అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలన్నారు. గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. గుమ్మడివానిపాలెంలో ఉన్న మైదానం తో పాటు మండలంలో ప్రతి పంచాయతీకి భవిష్యత్తులో  విస్తరింపజేస్తామన్నారు. యువకులు తగిన  తర్ఫీదును పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానానికి కావాల్సిన వసతులకు హామీ ఇస్తున్నామన్నారు.
 కార్యక్రమంలో సర్పంచ్ లు చంటి, గండ్రెడ్డి రమేష్,రాజు,శ్రీకాంత్, ఆర్గనైజర్స్, గోపి, అప్పలరాము, జూస్,ఈమేన్, కుమార్, లతో పాటు వైకుంఠ , రామకృష్ణ, అప్పలనారాయణ, అప్పలరాజు, మచ్చ శ్రీను. మచ్చ రామనాయుడు. కోరాడ వేణు. ఎడ్ల సాంబశివరావు. కోరాడ రమణ. తదితరులు

Name*
Email*
Comment*