నామినేషన్ వేసిన భీమిలి నియోజకవర్గ బి ఎస్ పి అభ్యర్థి

4/22/2024 8:11:02 PM

భీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్ 22;భీమిలి నియోజకవర్గం  బి ఎస్ పి  ఎమ్మెల్యే అభ్యర్థి సోమవారం   నామినేషన్    వేసారు.  ముందుగా ఆయన       ఉదయం 11 గంటలకు రాజుల తాళ్ళవలస లో ఉన్న   అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన  తాళ్ళవలస నుంచి  భీమిలి  ర్యాలీ గా వెళ్ళారు. తర్వాత స్ధానిక ఆర్డీవో కార్యాలయంలో ఉన్న ఆర్డీవో భాస్కర్ రెడ్డి కి  2 సెట్ల  నామినేషన్  లు  సమర్పించారు. అనంతరం  ఆయన  మాట్లాడుతూ    నేను స్ధానికుడిని , గంటా, అవంతి హయాంలో  భీమిలి ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ 5 ఏళ్ళ కాలంలో ఎస్సీలకు   అన్యాయం జరిగిందినీ , అంతేకాకుండా ఎస్సీ కార్పోరేషన్ నిర్వీర్యం చేయడమే కాకుండా   ,అంబేద్కర్ విదేశీ విధ్య ను తీసి జగనన్న విద్య ను ప్రవేశ పెట్టారనీ అన్నారు. సామాజిక న్యాయం అంటే   అన్ని  వర్గాల ప్రజలకు న్యాయం జరగలనీ చెప్పారు. సి.ఎం  56 బి.సి కార్పోరేషన్ లు పెట్టారే కానీ నిధులు లేవనీ అన్నారు.  ఎస్సీలకు న్యాయం జరగలేదనే ఉద్దేశ్యం తో  నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మే 13 న  జరిగే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలనీ కోరారు. యువతను ఉత్తేజ పరచండనీ , కొత్త వాళ్ళు రాజకీయాలలోకి రావాలని ఆయన అన్నారు.

Name*
Email*
Comment*