రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించుకోవాలి

4/22/2024 8:16:41 PM


భీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏప్రిల్ 22;సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా రైతు సోదరులకు ఆదాయాన్ని పెంచే విధంగా లాభసాటిగా వ్యవసాయం రూపొందించాలి. రైతులు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించుకొని లాభసాటిగా వ్యవసాయం తీర్చిదిద్దుకోవచ్చని ఆచార్య ఎన్ .జి రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఎల్ ప్రశాంతి పేర్కొన్నారు. ఉత్తర కోస్తా మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశము ఆచార్య ఎన్ .జి .రంగా విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశము మందిరము లో సోమవారం 22వ తేదీన ప్రారంభించబడింది. ఈ సమావేశము 22 , 23 తేదీలు కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఆచార్య ఎన్ .జి .రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్ ప్రశాంతి , విస్తరణ సంచాలకులు డాక్టర్ కె ఎస్ నాయక్  హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎల్ ప్రశాంతి  మాట్లాడుతూ ఉత్తర కోస్తా మండలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి తో పాటు నాలుగు వ్యవసాయ పరిశోధనా స్థానాలు, నాలుగు విస్తరణ కేంద్రాలు రైతులకు సేవలను అందిస్తున్నాయి. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించే దిశగా  రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పరిశోధనలను  విస్తరణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్దేశించారు. చెరుకు ,వరి ,చోడి నువ్వులు, అపరాలు, గోగురకాల రూపకల్పనలో వ్యవసాయ విశ్వవిద్యాలయ కృషి చేస్తుందని వీటితోపాటు రైతుకు సాగు ఖర్చు  తగ్గించే విధంగా యాంత్రికరణ  జీవన ఎరువులు జీవ సంబంధ చీడపీడల నివారణపై రైతులకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. చెరుకు యంత్రాన్ని చెరుకు నరికే యంత్రాన్ని కూడా రైతులకు త్వరలో అందుబాటులోనికి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పి వి కే జగన్నాధ రావు ఉత్తర కోస్తా మండలంలో 2023 24 సంవత్సరంలో జరిగిన పరిశోధన మరియు విస్తరణ ప్రగతి గురించి వివరించారు .ఉత్తర కోస్తా జిల్లాల రైతులను సోలాపూర్ లోని చెరుకు యంత్రం నరికే పరికరం పనితీరును మరియు ప్రాంతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాలు గురించి పరిశీలించుటకు విజ్ఞాన యాత్రలు నిర్వహించారు. విస్తరణ సంచాలకులు కె ఎస్ ఎస్ నాయక్  మాట్లాడుతూ ఏరువాక కేంద్రము, కృషి విజ్ఞాన కేంద్రాలు వ్యవసాయ సాగు ఖర్చు తగ్గించుకునే దిశలో యాంత్రికరణ డ్రోన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్ అనే అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ప్రదక్షణ క్షేత్రాలు నిర్వహిస్తున్నారు, రైతులకు నికర ఆదాయం పెంపొందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలియజేశారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా సీడ్ హబ్లు ఏర్పాటు చేసి వివిధ ఆధునిక విత్తనాలు అందుబాటులో తీసుకు రావలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రతినిధి  బాలునాయక్   మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సాంకేతిక పరిజ్ఞానము వ్యవసాయ శాఖకు ఎంతో అవసరమని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఎఫ్ ఆర్ ఎ డైరెక్టర్ డాక్టర్ జో కిజకుడన్ మాట్లాడుతూ దేశ వ్యవసాయ అభివృద్ధిలో వ్యవసాయ అనుబంధ రంగాలలో మత్స్య శాఖ కూడా తగిన పాత్ర పోషిస్తుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తా మండలంలోని వ్యవసాయ శాఖ డి .ఏ .ఓ లు, ఉద్యానవన శాఖ అధికారులు ,నాబార్డ్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఆత్మ అధికారులు ,వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు ,అభ్యుదయ రైతులు పాల్గొని ఉత్తర కోస్తా వ్యవసాయ అభివృద్ధికి తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమము 23వ తేదీ కూడా కొనసాగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ పివికే జగన్నాధ రావు తెలియజేశారు.

Name*
Email*
Comment*