టెన్త్ పరీక్షల్లో 82 శాతం ఉత్తీర్ణత

4/22/2024 8:21:17 PM


భీమునిపట్నం ఎక్స్ ప్రెస్ న్యూస్ 22;భీమునిపట్నం
మండలం, జి వి ఎం సి పరిధిలోని 22 జెడ్పీ, జి వి ఎం సి ఉన్నత పాఠశాలల్లో మంగళవారం విడుదలైన టెన్త్ పరీక్షల్లో ఈ ఏడాది 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 77శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత ఏడాది అదనంగా 5 శాతం పెరిగింది. ఇంగ్లీష్ మీడియం లో 642 మంది పరీక్షకు హాజరవ్వగా,581 మంది (90 శాతం ) ఉత్తీర్ణత సాధించిట్లు ఎం ఇ ఓ, ఎం శివ రాణి తెలిపారు. ఇందులో ఏ పి గురుకుల పాఠశాల కు చెందిన బంగారు నైనిష  588 మార్కులు,లావేటి దుర్గ 586 మార్కులు సాధించారు. భీమిలి మండలం లక్ష్మీ పురానికి చెందిన ఎం రాహుల్ 584 మార్కుల తో మూడో స్థానం లో నిలిచాడు.
తెలుగు మీడియం లో563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా, 408 మంది(72.5 శాతం) ఉత్తీర్ణత సాధించారు.భీమిలి మండలం,  మజ్జి వలస,జెడ్పీ హై స్కూల్ కు చెందిన ఆర్ ప్రమీల 570 మార్కులు, కె స్వాతి 563 మార్కులు, ఏ రాజేష్ 562 మార్కులు సాధించారు. మండలం  మొత్తంగా     ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1205 మంది పరీక్షలు రాయగా,989 మంది (82శాతం )ఉత్తీర్ణత సాధించారు.ఇంగ్లీష్ మీడియం లో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 34 మంది,తెలుగు మీడియం లో 22 మంది ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఈ ఏడాది 91 శాతం, గతేడాది 87 శాతం ఉత్తీర్ణత సాధించారు

Name*
Email*
Comment*