పది ఫలితాలలో విజయదుందుభి మ్రోగించిన విద్యార్థులు

4/22/2024 8:29:19 PM

                                                                    గోపాలపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్ - ఏప్రిల్ 22:  ఈ రోజు  ప్రభుత్వాధికారులు విడుదల చేసిన  ఎస్ ఎస్ సి ఫలితాలలో ఎన్ ఏ డి భాష్యం పాఠశాల విద్యార్ధులు విజయదుందుభి మ్రోగించారు. ఈ సందర్భంగా ఎన్ ఏ డి బ్రాంచ్ ప్రిన్సిపల్  మణికంఠ మాట్లాడుతూ ఎస్ ఎస్ సి పరీక్షలకు ఎన్ ఏ డి బ్రాంచ్ నుండి 327 మంది విద్యార్థులు హాజరయ్యరని, వారందరిలో 592 అత్యధిక  మార్కులతో మాలిన లిఖితశ్రీ పాఠశాల టాపర్ గా నిలిచిందని, గణితంలో వందకుమంద మార్కులు సాధించిన విద్యార్థులు 19 మందని విద్యార్థులను కొనియాడారు.  ఈ సందర్భంగా ఇంతటి ఘన విజయం  సాధించిన విద్యార్థులకు, విశేష కృషి చేసిన అధ్యాపక బృందానికి భాష్యం విద్యాసంస్థల అధిపతి రామకృష్ణ, సీఈఓ ఎం సత్యం, జోనల్ ఇంఛార్జ్ కె. వెంకట్ అభినందనలు తెలిపారు.

Name*
Email*
Comment*