ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో 86.69 శాతం ఉత్తీర్ణ‌త

4/22/2024 9:47:06 PM


- బాలిక‌ల‌దే పైచేయి
-  పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌
-  కర్నూలు జిల్లా లీస్ట్ 

 అమరావతి, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌ : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. సోమవారం ఉదయం విజయవాడలో ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలను విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. రికార్డుస్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారాయన. 
పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాలను విద్యార్థులకు ఒక్క క్లిక్‌దూరంలో విద్యార్థులకు సాక్షి అందుబాటులోకి తెస్తోంది.  www.sakshieducation.com వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. 

ఇంకా  ఆయన ఏమన్నారంటే..
    6.23 లక్షల మంది  విద్యార్థుల ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు రాశారు
    టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి
    బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17
    మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు
    ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌..  96.37 శాతం రిజల్ట్‌
    ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం)
    2,300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత
    ఒక్కరూ ఉత్తీర్ణ‌త కాని స్కూళు  17
    మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

Name*
Email*
Comment*