జగన్ నామినేషన్ దాఖలు

4/22/2024 9:50:05 PM


- ఆస్తుల వివరాలు వెల్లడి..
- చరాస్థుల విలువ రూ 483.08 కోట్లు
-  స్థిరాస్తుల విలువ రూ 35.90 కోట్లు
క‌డ‌ప‌, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
. బస్సు యాత్ర లో ఉన్న జగన్ తరపున పులివెందులలో నామినేషన్ దాఖలైంది. అందులో జగన్ ఆస్తుల వివరాలు వెల్లడించారు. సతీమణి భారతి స్థిర, చరాస్తుల గురించి ప్రస్తావించారు. ఈ నెల 25న జగన్ స్వయంగా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు పులివెందులలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. జగన్ నామినేషన్ ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ పులివెందులలో దాఖలైంది. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి ఒక సెట్‌తో కూడిన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోమ‌వారం ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశామని ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. 25న ఇక్కడ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆరోజు మధ్యాహ్నం తర్వాతే జగన్‌ నామినేషన్‌ వేస్తారని మనోహర్‌రెడ్డి చెప్పారు. బస్సు యాత్ర ముగిసిన వెంటనే.. మరో సెట్‌తో సీఎం జగన్‌ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకొని నామినేషన్‌ వేస్తారని ఆయన వివరించారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 25వ తేదీన పులివెందులో సభ ద్వారా జగన్ మలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. మరుసటి రోజున 26 వ తేదీన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టో పైన భారీ అంచనాలు ఉన్నాయి. 
ఆస్తుల వివ‌రాలు ఇలా...
. జగన్ చరాస్థుల విలువ రూ 483.08 కోట్లు కాగా, భారతి ఆస్తుల విలువ రూ 119.38 కోట్లుగా వెల్లడించారు. ఇక..జగన్ స్థిరాస్తుల విలువ రూ 35.90 కోట్లు, భారతి స్థిరాస్తుల విలువ రూ 31.11 కోట్లుగా చూపించినట్లు తెలుస్తోంది. 25న పులివెందులలో జగన్ నామినేషన్ పూర్తయిన తరువాత ఆయన సతీమణి భారతి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా బరిలో నిలిచారు. కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత హోరా హోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.

Name*
Email*
Comment*