పోలీసు కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు

4/24/2024 5:45:11 PM


- మూడు రోజుల కస్టడీకి అనుమతించిన విజయవాడ కోర్టు
- లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని ఆదేశం
విజ‌య‌వాడ‌, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయిదాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీశ్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు.. లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది.
నిందితుడు సతీశ్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సతీశ్ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గురువారం నుంచి సతీశ్‌ను విచారించనున్నారు.

Name*
Email*
Comment*