జగన్ ఎన్నికల ప్రచారానికి మ‌ళ్లీ బ్రేక్‌

5/5/2024 11:39:01 PM


. రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ల‌తో ప్ర‌త్యే క స‌మావేశాలు 
. మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గ రోడ్ షో ఒక‌రోజు వాయిదా
మ‌చిలీప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.  ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు. శనివారం నాడు శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు, నెల్లూరు సిటీలో రోడ్ షోల్లో ప్రసంగించారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జగన్ త‌న ప్ర‌చారానికి  ఆదివారం విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆయన పల్నాడు జిల్లాలోని రేపల్లె, మాచర్ల, కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించాల్సి ఉంది.  ఆదివారం పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో జగన్  సమావేశం కానున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న‌ నేపథ్యంలో పోల్ మేనేజ్‌మెంట్‌పై జగన్ దృష్టి సారించారు. బ్యాలెట్ ఓటింగ్‌పైనా ఆయన ఆరా తీయనున్నారు. బూత్, బ్లాక్ స్థాయిలో పోలింగ్ ప్రక్రియ, ఏజెంట్ల గురించి తెలుసుకోనున్నారు.

Name*
Email*
Comment*