ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ... ఇరు పార్టీల‌లో టెన్ష‌న్

5/5/2024 11:41:43 PM


. ఒక‌రికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ,  మ‌రొక‌రికి ముస్లిం రిజ‌ర్వేష‌న్లు
. ఈ విష‌యాల‌పై ఏమి మాట్లాడుతారోన‌ని 
 ఇరు పార్ట‌ల నేత‌లు ఎదురుచూపులు

విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
ఏపీలో ఎన్నికల రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్ప స‌మ‌యంలో  ల్యాండ్ టైటిల్ యాక్ట్ , ముస్లిం రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌పైకి వ‌చ్చి ఇరుపార్టీలను ఇర‌కాటంలో పెడుతోంది. ఇందులో  ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో వైసీపీని ఇర‌కాటంలో పెట్టాల‌ని చూస్తుంటే ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను తెర‌పైకి తెచ్చి టీడీపీని అడ‌క‌త్తెర‌లో బిగించాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌చారానికి ఏపీకి రావ‌డంతో ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే ఈ రెండు అంశాలు బీజేపీకి...ప్ర‌ధాని మోదీకి సంబంధించినివే. స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ప్ర‌ధానిపై ఉంది.  ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను చంద్రబాబు, పవన్ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. దీనికి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం చేస్తున్నారు. దీని పైన జగన్ స్పష్టత ఇచ్చారు. ఇది భూములకు భద్రత కల్పించే నిర్ణయమని చెప్పుకొచ్చారు. మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ అని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ తరువాత రైతులకే డాక్యుమెంట్లు అని చెప్పారు. భూ తగదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తరువాత రీసర్వే జరిగిందని వివరిచారు. పేదలకు భూములు ఇచ్చేది జగన్..లాక్కుదనేది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు.  

ముస్లిం రిజర్వేషన్ల అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మత ప్రాతిపదికన ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. దీని పైన ఏపీలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబును వైసీపీ కార్నర్ చేస్తోంది. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని జగన్ స్పష్టం చేసారు. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లని... మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న ఎన్డీఏ ను కాదని చంద్రబాబు బయటకు రాగలరా అంటూ జగన్ నిలదీసారు. అటు చంద్రబాబు రిజర్వేషన్లు కాపాడుతామని చెబుతున్నారు.  ఇదే సమయంలో ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ నీతి అయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం ప్రతిపాదించింది. దీని పైన ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ఈ యాక్ట్ పైన జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అదే విధంగా తెలంగాణ లో ప్రచారంలోనూ బీజేపీ ముఖ్యులు ముస్లిం రిజర్వేషన్ల రద్దు గురించి పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీతో సహా బీజేపీ కీలక నేతలు ఏపీలో ప్రచారానికి సిద్దమయ్యారు. ఈ రెండు అంశాల పైన మోదీ, కేంద్ర మంత్రులు ఏ ప్రస్తావన చేసినా..తమ వైఖరి చెప్పినా..కూటమికి ఎన్నికల వేళ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. దీంతో..ప్రధాని మోదీ తన ప్రచార సభల్లో ఈ రెండు అంశాల పై స్పందిస్తారా..ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది

Name*
Email*
Comment*