అమరావతి రాజధానిగా కొనసాగుతుంది

5/5/2024 11:46:22 PM


. జ‌గ‌న్ అవినీతి ప్ర‌భుత్వాన్ని దించేద్దాం
- ఎన్డీఏను గెలిపిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
. ధ‌ర్మ‌వ‌రం స‌భ‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ధ‌ర్మ‌వ‌రం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  ఏపీలోని జగన్ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటానికి కారణాలను వెల్లడించారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మద్య నిషేధం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చి మాట తప్పారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో - రాష్ట్రంలో ఎన్గీఏను గెలిపించాలని కోరారు. పార్లమెంట్, అసెంబ్లీలో భారీ మెజార్టీ వచ్చేలా మద్దతు ఇవ్వాలని అమిత్ షా పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం పై ఆరోపణలు ఆంధ్రాలో అవినీతి ప్రభుత్వాన్ని దించడానికే, గూండాగిరి, భూమాఫియా అంతానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్‌షా స్పష్టం చేశారు. ధర్మవరంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కూటమిని గెలిపించండి.. ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోదీ చేతుల్లో పెట్టాలని అమిత్‌షా కోరారు.  ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమస్థానంలో నిలిపారని చెప్పుకొచ్చారు. జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం చేయకపోగా.. మద్యం సిండికేట్‌కు తెరలేపారని విమర్శించారు. అట్టహాసంగా ఆరోగ్యశ్రీ ప్రకటించి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు, మోదీని గెలిపిస్తే సీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏను గెలిపించండి ఏపీలో 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆంధ్రాలో గూండాగిరి అంతానికి కూటమిగా ఏర్పడ్డామని.. అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి..ఆంధ్రాలో భూమాఫియా అంతానికే కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతామని చెప్పుకొచ్చారు. జగన్ ఇంగ్లీషు భాష కోసం పాఠశాలల్లో తెలుగు లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ రెడ్డి గుర్తుంచుకో.. భాజపా ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వమని చెప్పుకొచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా అమిత్‌షా పేర్కొన్నారు.

Name*
Email*
Comment*