ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని

5/5/2024 11:50:34 PM


. మోదీ మ‌నిషిని తాకితే మ‌సైపోతార‌ని హెచ్చ‌రిక‌
. . అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభలో చంద్రబాబు
అన్న‌మ‌య్య‌, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని, 400 ఎంపీ సీట్లతో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్నారని, నరేంద్ర మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? తాకడానికి ఎవరైనా వస్తే మసైపోతారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.  రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా ఉన్న బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కొనియాడారు. కిరణ్ కుమార్ అనుభవంతో పోల్చితే ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని పేర్కొన్నారు.    అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.ఆదివారం మధ్యాహ్నం అమిత్ షా హాజరైన ధర్మవరం సభలో పాల్గొన్న చంద్రబాబు... ఆ సభ ముగిసిన అనంతరం తంబళ్లపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ముసురు కాపు వర్గం జనాభా ఎక్కువని, అందుకే సామాజిక న్యాయం కోసం ముసురు కాపు వర్గానికి చెందిన జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చానని చంద్రబాబు వెల్లడించారు. 
దేవుడు స్క్రిప్టు తిరగరాశాడు... ఈ నెల 13వ తేదీన ఓటింగ్... జూన్ 4వ తారీఖున కౌంటింగ్... గెలిచేది మనమే! చిత్తుచిత్తుగా ఓడిపోయేది వైసీపీ! వైసీపీ ఇంటికి... మన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు, జయచంద్రారెడ్డి పార్లమెంటుకు వెళతారు... అప్పుడు చూపిస్తా మన తడాఖా అని బాబు అన్నారు.

హుందాత‌నం మ‌మ్మ‌ల్ని చూసి నేర్చుకోండి
సమైక్యాంధ్రప్రదేశ్ కు నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. హుందాతనంతో మెలగడం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలి పాపాల పెద్దిరెడ్డీ! నేను కన్నెర్ర చేసుంటే ఈ అంగళ్లుకు వచ్చేవాడివా, పుంగనూరులో ఉండేవాడివా నువ్వు? నువ్వేమైనా పెద్ద మొనగాడివా? మాకు రోషం లేదనుకుంటున్నావా...? నీ కొమ్ములు విరిచేస్తా, నీ కొవ్వు తగ్గిస్తాం... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. 
ఈ రాష్ట్రం మీ అబ్బ జాగీరా? నువ్వేమో పుంగనూరులో ఎమ్మెల్యే కావాలి, మంత్రివి కావాలి... నీ తమ్ముడు వలస పక్షి తంబళ్లపల్లెకు రావాలి... తంబళ్లపల్లె మీ తాత జాగీరా? నీ కొడుకు ఎంపీ కావాలి... ముగ్గురూ కలిసి దోచేయాలి... అడిగితే దాడులు చేస్తారా?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Name*
Email*
Comment*