ప్రజాసంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత

5/5/2024 11:56:30 PM

గోపాలపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్ - మే 05:  ప్రజాసంక్షేమమే మా మొదటి ప్రాధ్యానతని గోపాలపట్నం కుమారి కళ్యాణమండపంలో జరిగిన కాపు, తెలగ, బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ  నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే ఆడారి ఆనందకుమార్ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమనికే ప్రాధాన్యతని, కాపులకు వైసీపీ పెద్దపీట వేసిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనందకుమార్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి  చెప్పారు. కాపులను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని, వారికి పెద్దపేట వేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆడారి మాట్లాడుతూ అన్ని కులాలకు సమాన ప్రాతిపదికన సంక్షేమ పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించారని, అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆయా కులాలకు ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ప్రజా సంక్షేమానికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించాలని సూచించారు. ఈ సందర్భంగా బొత్స  ఝాన్సీ మాట్లాడుతూ వైసీపీ విజయానికి కృషిచేసిన  ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి,  విశాఖ ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, నియోజవర్గం లో ఉన్న కాపు తెలగ, బలిజ కులస్తుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు ముందుంటామని, పిలిస్తే పలుకుతామని, నియోజవర్గం ఇప్పటికే 255 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టామని, బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అందించామని,సొంత నిధులతో పెన్షన్లు విద్య, వైద్యానికి సంబంధించిన ఆర్థిక సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. మంచికి చెడుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల సహా పరిశీలకులు పేడాడ రమణకుమారి, పార్టీ ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*