అంధుల పాఠశాల నిర్వహణకు వసతి ఇవ్వండి- భీశెట్టి బాబ్జి

6/10/2024 5:46:29 PM

విజయనగరం: ఎక్స్ ప్రెస్ న్యూస్ :
విజయనగరంలో బాబా మెట్ట సమీపంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా గడచిన పదిహేనేళ్ల సంవత్సరాల నుండి మాచేపల్లి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారకామాయి అంధుల పాఠశాల ను అద్దె భవనంలో నిర్వహించలేక మూసివేస్తున్నామనే ప్రకటన పత్రికల్లో చూసి సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన చెందారు. జిల్లా అధికారులు వెంటనే పాఠశాల నిర్వహణకు తగిన వసతి కల్పించాలని భీశెట్టి బాబ్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి.అనిత ని కోరారు. సోమవారం ఆమెకు వినతిపత్రం అందచేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆశా జ్యోతి ఇంతవరకు తక్కువ అద్దెతో పాటశాల నిర్వహించారు. కానీ ఇప్పుడు భవన యజమాని ఖాళీ చెయ్యమని చెప్పటంతో పెద్ద ఎత్తున అద్దె చెల్లించ లేక కొత్తగా పాఠశాల లో చేరే అంధ విద్యార్థులను కాదనలేక తప్పని పరిస్థితుల్లో పాఠశాల మూసివేస్తున్నామని చెప్పడంతో చాలామంది అంధులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. తన పిల్లాడితో పాటు ఇతర పిల్లల కోసం స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న అంధుల పాఠశాల ను నిర్వహిస్తున్న ఆశా జ్యోతి ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. పట్టణంలో అనేక కార్పొరేషన్ భవనాలు ఖాళీగా ఉన్నాయని, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు వాస్తవాలు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని భీశెట్టి జిల్లా రెవెన్యూ అధికారి అనితను కోరినట్లు చెప్పారు.

Name*
Email*
Comment*