- చేస్తున్న చైనీయులు
- మోసాన్ని ఛేదించిన విశాఖ పోలీసులు
విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్, జూన్, 6:
ప్రతి రోజూ సోషల్ మీడియా లో ఫెక్ పోస్టులు, మొబైల్స్ కి ఫెక్ మెసేజ్ లు వస్తుంటాయి. టెలిగ్రామ్, ఫెసబుక్, మొబైల్స్కి సాధారణ మెసేజ్ లు ఇలా అనేక విధాలుగా, వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇవ్వన్నీ ఇండియా లో ఇతర రాష్టాల్లో నుంచి వస్తున్నాయని మనం భావించే వాళ్ళము. కానీ కాదు, ఇండియా లో ఇక్కడ వివిధ సెల్ కంపెనీ లు అమ్మే సిమ్ లు ఇండియా నిరుద్యోగ యువతీ, యువకులు ద్వారా కొనుగోలు చేయించి, ఇదే సిమ్ లు కంభోడియా దేశం లో ఒకొక్క సిమ్ 10 నుండి 15 వేలు వరకు అమ్ముతున్నారు. ఈ సిమ్ లు కొనేవాళ్ళు చైనీ దేశస్తులు. ఇవి కొని ఏమి చేస్తారని అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి అసలు మోసం ప్రారంభం అవుతుంది. ఇదే సిమ్ లు తో ఇండియా లో వివిధ రాష్టాలు వారికి కాంభోడియా దేశం నుండి కాల్స్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయ భాష ల్లో కాల్స్ చేస్తారు. మీకు కోటి రూపాయలు లాటరీ వచ్చిందని, అమ్మాయి లు ఫొటోస్తో ప్రలోభం, వివిధ రకాలుగా పెట్టుబడి పెడితె ఇంత లాభం వస్తుందని, ఇలా అక్కడ నుంచి యువతీ యువకులు చేత కాల్స్ చేయించి పాస్వర్డ్, ఎటిఎం పిన్ నెంబర్లు చక్క గా మాట్లాడటం వల్ల ఇక్కడ కొంతమంది అమయుకులు మొత్తం వివరాలు చెప్పేస్తున్నారు. వీరు ఇలా చెప్పడం అలా వారి బ్యాంకు ఖాతా ఖాళీ కావడం జరుగుతుంది.
ఈ మోసాల్లో బ్యాంకు సిబ్బంది, సిబ్బంది,ఇతర ఉన్నత ఉద్యోగులు రిటైర్ అయిన వారిపై ఎక్కువగా పెడతారు. వీరిలో ఎక్కువ డబ్బులు ఉన్న కుటుంబంలు పై ద్రుష్టి సారిస్తారు. ఒక్కోక్క సారి ఎమ్మెల్యే, ఎంపీ, ఇంకా ఇతర ఉన్నత అధికారులు కూడా ఇందులో మోసం పోవడం జరుగుతుంది. వీరు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవి శంకర్ నాయిర్ భాధితులు ద్వారా ప్రత్యేక్ష అనుబవాలు చెప్పించారు. ఇండియా నుంచి నిరుద్యోగలు ని గుర్తుంచి ఆ దేశం లో మంచి ఉద్యోగం ఆశ చూపించి కొంతమంది ఏజెంట్ లు ఇక్కడ నుంచి కంభోడియా దేశం లో వదిలేస్తారు. ఇక అక్కడ వీరికి అప్పజెప్పిన ఉద్యోగం చూసి ఇండియా నుంచి వెళ్లిన వారికి మతి పోతుంది. ఇండియా ని ఆర్ధికoగా దెబ్బ కొట్టాలని చైనీయులు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతున్నట్లు భాడుతులు తెలిపుతున్నారు. అందుకే ఇండియా లో ప్రభుత్వం యువత ఉద్యోగ అవకాశం కల్పించితే ఇలాంటి మోసాలు కి గురి అవ్వరని భాదితులు కోరారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ రవి శంకర్ నాయిర్ మాట్లాడుతూ మన దేశం లో ఇలాంటి మోసం చేసే ఏజెంట్ లు మొత్తం ఇప్పటి వరకు 21 మందిని గుర్తించామని అందులో ఇప్పటి వరకు 11 మందికి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
దేశం నుంచి లక్ష మందికి పైగా నిరుద్యోగులు కంభోడియా దేశం లో ఉన్నారని అక్కడ మోసం కంపెనీల్లో గతి లేని పరిస్థితి లో పని చేస్తున్నారని తెలిపారు. కంపెనీ వారు చెప్పినట్లు చేయకపోతె వీసా, పోర్ట్ తీసుకోవడం, చిత్ర హింస చేయాడం చేస్తున్నారని అన్నారు. అందుకే అలాంటి పరిస్థితి లో భారత్ ఎంబసీని కలిస్తే ఏమర్జసీ పాసుపోర్టు ఇస్తారని, దీన్ని ఉపయోగం చేసుకొని ఇండియా కి రావొచ్చు ని సూచించారు. మన రాష్ట్రము నుంచి 158 మందికి అక్కడ ఉన్నట్లు గుర్తించామని వీరిలో ఇప్పటి వరకు 68 వరకు తీసుకోచ్చామని, ఇంకా 90 మంది రావాల్సి ఉందని అన్నారు. కావున ఇలాంటి మోసాలుకు గురి కాకుండా పౌరులు జాగ్రత్తగా ఉండాలని, ముక్యంగా యువత దీనిపై అలెర్ట్ అవ్వాలని కోరారు. ఈ సందర్బంగా భాదితులు విశాఖపట్నం పోలీస్ లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం లో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, ఇతర అధికారులు వెంకటరవు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.