రామోజీ రావు సంతాప సభ

6/10/2024 7:07:36 PM

విశాఖపట్నం -ఎక్స్ ప్రెస్ న్యూస్ :
విశాఖ పబ్లిక్ లైబ్రరీ లో రామోజీ చిత్ర పటానికి - విశాఖ జర్నలిస్ట్ లు జర్నలిస్ట్ సంఘాల వారు పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సభలో ఎస్ డి వి ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సత్యనారాయణ రాజు, లీడర్ ఎడిటర్ రమణ మూర్తి, విజన్ ఎడిటర్ శివశంకర్, జాతీయ జర్నలిస్ట్ సంఘ కార్య దర్శి ఆంధ్ర ప్రభ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు, ఏపీజేడబ్లూ అధ్యక్షులు నారాయణ,  వి.జె.హెచ్.ఏ కార్యదర్శి నిజం ఎడిటర్ రవి కాంత్, విశాఖ సమాచారం సంపాదకులు వీరభద్రరావు, విశాఖ ఈటివి బ్యూరో కూర్మ రాజు, సీనియర్ పాత్రికేయులు డి డి ఆనంద్  చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు పులి గెడ్డ  సత్యనారాయణ, జననేత ఎడిటర్ శివారెడ్డి, సీనియర్ జర్నలిస్టు మోహన్ , హరనాథ్ ,విశాఖ పత్రిక ఎడిటర్ సన్యాసిరావు,లక్ష్యం ఎడిటర్ రవికుమార్, నివాళి అర్పించారు.
 రామోజీ గ్రూప్ సంస్థల అధినేత గొప్పతనం కోసం పలువురు మాట్లాడారు. 

వివి రమణమూర్తి లీడర్ ఎడిటర్:
ఈనాడు పత్రిక విలువలు నైతికత కు పెట్టింది పేరు. సూక్ష్మ అంశాలు సైతం పరిశీలించి వార్తలు అందించేవారు.

సత్య నారాయణ రాజు, ఎస్ డి వి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్:
ఈనాడు పత్రిక పుట్టింది విశాఖ. ఇక్కడ పుట్టిన పత్రిక ప్రపంచ వ్యాప్తంగా పాఠకులకు దగ్గర అయ్యింది. అందుకే విశాఖ లో వారికి విగ్రహం ఏర్పాటు చేయాలి.

ఆంధ్ర ప్రభ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనిబాబు: 
రామోజీ కృషి, పట్టుదల, ఆదర్శనీయం ఒక పత్రికాధినేత మృతి చెందితే రాష్ట్ర పతి, ప్రధాని దేశ విదేశీ ప్రముఖులు ఇంతగా స్పందించింది రామోజీ కే.

విజన్, ఎడిటర్ శివశంకర్:
తెలుగు జాతి గర్వపడే వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతి పెంపొందించిన వారు రామోజీ నే. జర్నలిజంలో అక్షర యోధులు అనే పేరు సుస్థిరం చేసుకున్నారు.
 
రవికాంత్, నిజం ఎడిటర్:
ఈనాడు స్ఫూర్తి తో సొంత స్థానిక పత్రిక నడిపే స్ఫూర్తి నిచ్చారు. అక్షరాలతో సమాజంలో మేలు చేసిన వ్యక్తి.

డి డి ఆనంద్:
ఒక గొప్ప వ్యక్తి కి నివాళి అర్పించే అదృష్టం దక్కింది. ఫోర్త్ ఎస్టేట్ కి నిజమైన నిర్వచనం రామోజీ. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

పులిగడ్డ సత్యనారాయణ, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు:
ప్రజలకు వార్తలు అందాలి అంటే ప్రజా వాడుక భాష ఉండాలని దిశా నిర్దేశించిన వ్యక్తి రామోజీ. భాషా సాహిత్యం, నవల సాహిత్యం పెంపొందించిన వ్యక్తి  రామోజీ.

హరనాథ్  సీనియర్ జర్నలిస్టు:
జర్నలిస్ట్ అంటే పది మందికి  మంచి చేయాలి అనే దృక్పథం ఇచ్చిన వారు రామోజీ. రామోజీ అడుగుజాడల్లో నడవాలి. వారి ఆశయా సాధనకు కృషి చేయాలి.

నారాయణ, ఏ పి జె  ఎఫ్ ప్రెసిడెంట్:
విశాఖ లోనే ఈనాడు పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈనాడు జర్నలిజం లో ఒక డిక్షనరీ.

మోహన్:ఏ పి జె ఎఫ్ కార్యదర్శి:
వారి కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. ఎన్ని పత్రికలు వచ్చిన ఈనాడు తెలుగు వారి మనస్సుకు హత్తుకున్నది.

శివారెడ్డి, జననేత పత్రిక ఎడిటర్: 
ఈనాడులో శిక్షణ కోసం గుణ అనే ఒక నిఘంటువు ఏర్పాటు చేశారు. చాలా ముందు చూపు , ప్రణాళిక బద్దమైనది రామోజీ జీవనం. వారి కుటుంబానికి నివాళి అర్పిస్తున్నాను.

కూర్మ రాజు , విశాఖ ఈటివి హెడ్:
రామోజీ జీవితం కొన్ని వేల వ్యక్తిత్వ వికాస పుస్తకాల సమాహారం. అక్షరాల ద్వారా తెలుగు భాషా వికాసానికి కృషి చేశారు. విశాఖ గడ్డ నుంచే ఈనాడు ఆవిర్భావం జరిగింది గర్వకారణం. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

చిట్టిబాబు సీనియర్ జర్నలిస్ట్:
ఈనాడులో జర్నలిస్ట్ గా  మొదలు లో పెట్టి మీడియా రంగంలో నిలబడే స్ఫూర్తి నిచ్చారు. వారి జీవితం నిరంతరం స్ఫూర్తి దాయకం.

ఏం ఎస్ ఆర్ ప్రసాద్:
రామోజీ జీవితం ఒక ఆదర్శనీయం, వారి అడుగుజాడల్లో నడిచే ప్రతి జర్నలిస్ట్ ఉన్నత శిఖరాలకు వెళ్తారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

Name*
Email*
Comment*