నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు- వంశీ కృష్ణ శ్రీనివాస్

6/10/2024 7:33:07 PM

విశాఖపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్ :
వంశీ కృష్ణ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడుతూ నాకు ఇంతటి మెజారిటీతో గెలిపించిన సౌత్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదములు. ప్రజలు నాకు బాధ్యతను పెంచారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తాను.  జగదాంబ నుంచి పూర్ణమర్కెట్ రోడ్డు లో ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. త్వరలోనే ఆ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని అన్నారు.  నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేస్తాను అలానే ఇచ్చిన ప్రతి ఒక్క హామి కూడా నెరవేరుస్తాను.  ప్రజలకు అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే ఓటు వేశారు. ఇంట్లో కూర్చుని బటన్ నొక్కుత అనే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే నాయకుడు కావలి తప్ప నేనే హిట్లర్ లా పాలిస్తా అంటే అవ్వదు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నడూ లేని విధంగా తీర్పు ఇచ్చారు. పవన్ ఆశయాలు కోసం నిరంతరం కృషి చేస్తాను అని చెప్పారు. 
రాష్ట్రంలో అహకారంతో కూడుకున్న పరిపాలన చేశారు కాబట్టే ఇంతటి ఘోర పరాజయాన్ని చూశారు. మంత్రులను పురుగులును చూసినట్టు చూశారు. ధనుంజయ రెడ్డి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనుషులతో మాట్లాడరు.
వైసిపి ప్రభుత్వంలో మద్యం, ఇసుక విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది అని అన్నారు.  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక రకాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సజ్జలకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంటి సంబంధం.
ఆయన కేవలం పార్టీకి సలహాదారుడు మాత్రమే. నాతో ఉన్న వారిపై దాడులు చేయించారు అని అన్నారు. 
సీఎంఓ నుంచి కూడా నాకు ఫోన్లు చేయించారు. కామరాజు కాటరాజు కలిపి నాపై దాడులు చేయించారు. వ్యాపారాన్ని వ్యాపారం లా చేయండి కానీ దానిని రాజకీయం చేయకూడదు అని పేర్కొన్నారు.  ఏయు వీసీ ఎప్పుడు ఆయన వీసీ లాగా ప్రవర్తించలేదు. గతంలో ఏయు కార్యాలయాన్ని దేనికోసం ఉపయోగించారో నాకు తెలుసు. ఏయు వీసీ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని చేశారు. ఆయన పై తీవ్రమైన వ్యతిరేకం ఉంది జగన్ కు ఏజెంట్ లా పనిచేసి, ఉత్తరాంధ్ర ను నాశనం చేశారు. నాయకులపై తప్పుడు ప్రచారం చేశారు. విసి ప్రసాద్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావద్దు అని చెప్తున్నను. 
ఒక్క నెల ఆగితే అన్ని మారుతున్నాయి. ఎంవీవీ వల్ల వైసిపి నాశనం అయిపోయింది.  జగన్ మోహన్ రెడ్డి ఎంవీవీ ని చాలా నమ్మారు. ఎంవీవీ నీ ఏ పార్టీ కూడా ఆహ్వానించారు. జీవీఎంసీ లో నలుగురిని మేనేజ్ చేసి కొన్ని టీడీఆర్ లు కొట్టేయాలని చూశారు. టిడీఆర్ లావాదేవీలపై ప్రతి ఒక్క ఆధారం కూడా నా దగ్గర ఉంది. ఎండడ వద్ద ఉన్న శ్రీరామ్ ప్రాపర్టీస్ సమీపంలో ఎక్స సర్వీస్ మెన్ ల్యాండ్ లో తప్పుడు పాత్రలు సృష్టించారు అని ఒకరు నా దగ్గరకి ఒక లెటర్ పట్టుకుని రావడం జరిగింది. ఎంవీవీ సిటి అపార్ట్మెంట్ లో ప్రభుత్వ భూమి ఉంది ఎంవీవీ చేసిన ప్రతి అరాచకాన్ని పవన్, చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తను. నాపై వ్యతిగతంగా విమర్శలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని చెప్పారు. ప్రతి అక్రమం పై పూర్తి విచారణ జరిపి ఉక్కుపాదం మోపుతాను అలానే విశాఖ కు గ్రీన్ సిటి గా తీర్చిదిద్దుతాం అని వివరిచారు. 

Name*
Email*
Comment*