విశాఖ విమల విద్యాలయానికి సహాయ సహకారాలు యధావిధిగా కొనసాగించాలి

6/14/2024 10:02:35 PM

స్టీల్ ప్లాంట్ -ఎక్స్ ప్రెస్ న్యూస్: 
విశాఖ విమల విద్యాలయానికి, కేంద్రియ విద్యాలయానికి విశాఖ ఉక్కు కర్మాగారం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని యాజమాన్య - యూనియన్ల ఒప్పందం ఉందని, ఆర్థిక ఇబ్బందులను మరియు ఇతర కారణాలను ఉక్కు యాజమాన్యం సాకుగా చూపాడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ కౌన్సిలర్,  ఉక్కునగర వైస్సార్సీపీ ఇంచార్జ్ వై వరలక్ష్మి కోరారు.
స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందిస్తున్న విశాఖ విమల విద్యాలయానికి సహాయ సహకారాలు నిలుపుదల చేస్తూ విశాఖ ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకొని నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  మరియు పాఠశాల సిబ్బందికి ఇబ్బందులు కలగచేయకుండా  యధావిధిగా విశాఖ విమల విద్యాలయ కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని వరలక్ష్మి కోరారు.

Name*
Email*
Comment*