పేరు మార్చుకున్నా ఆగని వేధింపులు

6/21/2024 6:54:07 PM

-  ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండని ముద్రగడ ఆవేదన

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
బూతులు తిట్టడం కంటే మా ఫ్యామిలీని ఒకేసారి చంపేయండి అంటూ కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. దాడులు జరగకుండా టీడీపీ నేతలకు కూడా పవన్‌ కల్యాణ్‌ సూచించాలని కోరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాలు విసిరి బొక్కబోర్లాపడటంతో ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా ప్రజల ముందు పెట్టారు. అయినప్పటికీ ముద్రగడపై వేధింపులు ఆగడం లేదు. సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తన ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు న్యాయం చేయాలని పవన్‌ కల్యాణ్‌ను విజ్ఞప్తి చేశారు. జన సైనికులు తన మీద బూతులతో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని జన సైనికులను మందలించాలని సూచించారు.

Name*
Email*
Comment*