కొల్లు రవీంద్ర ను సత్కరించిన మాధంశెట్టి నీ బాబు

6/24/2024 5:27:35 PM

అనకాపల్లి: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూన్  24.
రాష్ట్ర బీసీ సెల్ లు కొల్లి రవీంద్రను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఉదయం రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సందర్భంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ సెల్ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మాదం శెట్టి నీలాబాబు పాల్గొని మంత్రివర్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర కు పుష్పగుచ్చుం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీలబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని అనేకమంది బీసీలు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా అట్టడుగు నున్న వర్గాలకు అవకాశాలు కల్పించి సమాజంలో గుర్తింపు తీసుకువచ్చిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సమాజంలో బీసీలు తలెత్తుకునే విధంగా ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వ పరంగా అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నీల బాబు అన్నారు. బీసీలకు అవకాశాలు కల్పిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

Name*
Email*
Comment*