- వరుస హామీల తప్పిదాలపై ఎదురుదాడులు
- తాజాగా అమ్మ ఒడి జీవో పరువు బజారులోకి
- ఆడుకుంటున్న నెటిజన్లు
విశాఖపట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్;
ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల పై ఓ వైపు విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో ఆటాడుకుంటున్నారు తప్పుడు అంకెలతో వీటిని విడుదల చేస్తున్నారని వైసీపీ మండిపడుతుంటే ... ఆ తప్పులను సరిదిద్ది పాలన చేయాలని అధికారం ఇస్తే గత ప్రభుత్వంపై నెట్టేసి విమర్శలు ఏమిటని సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నారు. నెల రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో హామీలు అమలు చేయకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారని.. ఇప్పుడు ఎక్కువగా బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు.
మాట ఎందుకు మార్చారు చంద్రబాబు...
ట్రూఅప్ ఛార్జీల గురించి ప్రశ్నిస్తే తాను విద్యుత్ ఛార్జీలు పెంచననే మాట ఎప్పుడు అన్నానని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని తాజాగా మాజా మంత్రి పేర్ని నానీ విమర్శించారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటే సరైన సమాధానం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని వివరించారు. సంపద సృష్టించి అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసారు. 2019లో చంద్రబాబు సృష్టించిన సంపద ఎక్కడ ఉందో ఎవరికీ కనపడలేదన్నారు. "తల్లికి వందనం" ఒక్క బిడ్డకేనా - , లేదా అందరికీ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతీ పిల్లాడికి రూ 15 వేలు ఇస్తామన్నారని...తల్లికి వందనం అంటూ ఇప్పుడు జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకం కారణంగానే పోలవరం నాశనమైందని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కారణంగానే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. నచ్చినోళ్లకు కాంట్రాక్టు ఇచ్చి పోలవరం నాశనంకు కారణం అయ్యారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉచితం పేరుతో దోచుకోవటానికి ఇసుక పాలసీ తెచ్చారని ఆయన మండిపడ్డారు.