- నాలుగు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ...
- ఈ నెల 14న తెరచుకోనున్న వైనం
ఒడిశా, ఎక్స్‌ప్రెస్ న్యూస్;
ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం మరోసారి వార్తల్లొకెక్కింది. పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని ఈ నెల 14వ తేదిన తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భాండాగారం ఎంతో రహస్యమైన గది. ఇందులో అనేక అమూల్యమైన అభరణాలున్నాయని సమాచారం. ఈ భాండాగారంలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించేందుకే ఈ నెల 14న దీనిని తెరవబోతున్నారు. ఆ సమయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 1978 తర్వాత తొలిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే, చాలా సందర్భాల్లో ఈ తెరిచేందుకు ప్రయత్నించినా పాముల భయంతో చాలామంది లోపలకి వెళ్లలేపోయారు. అయితే పురాతన దేవాలయాల్లోని ఖజానాలకు పాములు కాపలా ఉంటాయనే నమ్మకం ఇంకా నెలకొని ఉండడంతో ఇందులో వెళ్లేందుకు చాలామంది భయపడుతున్నారు. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ భాండాగారంలో ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. వీటి ధర వెలకట్టలేదని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. టువంటి అత్యంత విలువైన ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తడంతో ఈ రత్నాభాండగారాన్ని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం వెళ్లింది. ఆ రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేక వెనుదిరిగింది. ఈసారి అధికారులు అన్నీ ప్రణాళికలతో ఈ రహ్యస గదిని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.