సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోమ‌న‌లేం

7/12/2024 10:11:24 PM

- నేరం నిరూపితం కాకుండా మేము ఆ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేం
- ప్ర‌జ‌లు ఎన్నుకుంటే మేం ఎలా ఆదేశించ‌గ‌లం
- త‌రువాత ఆయ‌న నిర్దోషిగా తేలితే ప‌రిస్థ‌తి ఏమిటి
- ప‌లు వ్యాజ్యాల‌ప సుప్రీం కోర్టు కీలక ప్ర‌శ్న‌లు 

ఢిల్లీ; 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తన పదవి నుంచి దిగిపోవాలన్న డిమండ్ పై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం పదవికి కేజ్రీవాల్ అనర్హుడంటూ వెంటనే పదవికి రాజీనామా చేయాలని దాఖలైన పిటిషన్‌పై  స్పందించింది. ప్రజల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ నాయకుడిని పదవి నుంచి దిగిపోవాలని కోర్టు ఆదేశించలేదని ఈ అంశంపై తమకు సందేహంగా ఉందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రినే కాదు ఏ మంత్రిని పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది.  ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడని, ఢిల్లీ ముఖ్యమంత్రి అనే  విషయం తమకు తెలుసని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆ పదవి ఎంతో విలువైనది అదే సమయంలో ప్రభావం కలిగి ఉన్నదనే స్పృహ తమకుందని పేర్కొంది. దీంతో పదవిపై ఎలాంటి దిశానిర్దేశం చేయలేమని కోర్టు వెల్లడించింది. ఇక తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా లేక పదవికి రాజీనామా చేయాలా అన్న విషయాన్ని కేజ్రీవాల్‌కే వదిలేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. 

పెరుగుతున్న రాజీనామాల ఒత్తిడి...
ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుంచి తాను సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈ ఒత్తిడి ఎక్కువైంది. బీజేపీ పార్టీ దేశ రాజధానిలో పలు నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అతని పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ నేరం చేశాడనేది నిరూపితం కాలేదని గుర్తు చేసిన పార్టీ, ఏ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయలేదని చెప్పుకొస్తోంది. కేజ్రీవాల్ సీఎంగా అనర్హుడని, వెంటనే పదవి నుంచి తప్పుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటు సుప్రీంకోర్టులో అటు ఢిల్లీ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైయ్యాయి. అయితే ఈ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. గతంలో కూడా అంటే 2019లో కేజ్రీవాల్ పై ఓ కేసు విచారణ దశలో ఉండగానే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కేజ్రీవాల్ నిర్దోషిగా నిరూపితమైతే అప్పుడు పరిస్థితి ఏంటని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది మే నెలలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది న్యాయస్థానం.అప్పుడు కూడా ఆయన రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్లు వచ్చాయి. ఇందుకు తిరస్కరిస్తూ తాను చేయని తప్పుకు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించారు. తాను రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటుందంటూ అది మమతా బెనర్జీనే కావొచ్చని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదన్న కేజ్రీవాల్... తను బలవంతంగా రాజీనామా చేయాలనే కుట్ర తెరవెనుక జరుగుతోందని వివరించారు.

Name*
Email*
Comment*