జిల్లా ఎస్పీ కి అభినందనలు

7/12/2024 10:35:42 PM

విజయనగరం - ఎక్స్ ప్రెస్ న్యూస్ :
విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి, నేటికి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ ని జులై 12న అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ ఆధ్వర్యంలో పలువురు పోలీసు అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మాట్లాడుతూ - జిల్లా ప్రజలు, వివిధ హోదాల్లో, వివిధ పోలీసు స్టేషనుల్లో జిల్లాలో పని చేస్తున్న సమర్థవంతమైన పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టి సహకారంతో జిల్లాలో సమర్ధవంతంగా పని చేశాననన్నారు.
మూడు సంవత్సరాల వ్యవధిలో ఎన్నో క్రియాశీలక కేసులను చేధించడంతోపాటు, సార్వత్రిక ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి మేజర్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించి, రాష్ట్రంలోనే ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించిన జిల్లాగా రాష్ట్రంలోనే విజయనగరం జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ సమర్ధవంతంగా వ్యవహరించి, కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి  ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ, దిశా నిర్దేశం చేశారని పలువురు పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ పని తీరును కొనియాడారు. 

అనంతరం, మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ కేక్ కట్ చేసి, అధికారులు, సిబ్బందికి అందజేశారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ ని అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డిఎస్పీ  ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, సిఐలు కె.కె.వి.విజయనాథ్, ఈ. నరసింహ మూర్తి, బి. వెంకటరావు, కె.రామారావు, జి. మురళి, జి.రాంబాబు, ఎస్సైలు అశోక్ కుమార్, ఆర్.వాసుదేవ్, గణేష్, ప్రభావతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించి, పుష్ప గుచ్చాలను అందజేశారు.

Name*
Email*
Comment*