హర్యానలో ప్రపంచంలో గల అత్యంత శక్తి పీఠం

7/14/2024 10:37:33 AM

విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్ :                   
 ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి అమ్మ శక్తి పీఠం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ జాతీయ అధ్యక్షులు గోపాల్ శరన్ గార్గ్ తెలిపారు. విశాఖలో అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ లో అయన మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీకి 190 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రంలో గల అగ్రుహలో ఈ శక్తి పీఠం నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుమారు అయిదు వందల కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన శక్తి పీఠం నిర్మాణం వచ్చే ఏడాదికి తొలి దశ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. సమ్మేళన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యవర్గం బాధ్యతలు స్వీకరణ మహోత్సవానికి విశాఖ విచ్చేసిన గోపాల్ శరన్ గార్గ్ ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి గోపాల్ గోయల్, దక్షిణ భారత కార్యదర్శి చాంద్ మాల్ అగర్వాల్, దక్షిణ భారత నిర్వాహక కార్యదర్శి శశికాంత్ అగర్వాల్, అధికార ప్రతినిధి అశోక్ బన్సాల్తో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. 108 అడుగుల ఎత్తు, 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు కొలతలతో పది ఎకరాలలో మహాలక్ష్మి అమ్మ మందిరం నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. రాజస్థాన్లోని బన్సీ పహాడ్ పూర్ నుంచి దోల్పూర్ (గులాబి రంగు) రాయితో నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఇనుము వినియోగించకుండా గులాబీ రంగు రాయితో ఆలయం నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం తరహాలో మహాలక్ష్మి అమ్మ శక్తిపీఠం రూపుదిద్దుకుంటుందని అన్నారు. హిందూ సనాతన ధర్మం కలకాలం నిలిచే విధంగా అగ్రుహలోని మహాలక్ష్మి శక్తి పీఠం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

హిందూ ధర్మం, హిందూ సంక్షేమం, మానవ కళ్యాణం, శాంతి స్థాపనకు అగర్వాల్ సమ్మేళన్ నిరంతరం కృషి చేస్తోందని గోపాల్ శరన్ గార్డ్ అన్నారు. అగర్వాల్ సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం అగ్రసేన్ మహారాజు స్ఫూర్తిగా తీసుకుని అయిదు దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ స్వర్ణోత్సవ వేడుకలకు సిద్దమయ్యిందని చెప్పారు. కలియుగ అవతారీ, పేదలపాలిట పెన్నిది. ధర్మ సంస్థాపనకారి, అహింసా పూజారీ అగ్రసేన్ మహరాజ్ యుగపురుషుడని ఆయన అభివర్ణించారు. మహా భారత యుద్ధాన్ని బార్బికుడు, అగ్రసేన్ మహారాజ్ ఈ ఇరువురు మాత్రమే చివరి వరకు వీక్షించిన అదృష్టవంతులని ఆయన తెలిపారు. బార్బకుడు ఖాటూలో శ్యామ్ బాబాగా పూజలు అందుకుంటున్నారని అన్నారు. అగ్రుహ రాజధానిగా క్రీస్తు పూర్వం 5178 ప్రాంతంలో అగ్రసేన్ మహారాజ్ పాలన చేశారని ఆయన తెలిపారు. అగ్రసేన్ మహారాజ్ గురించి 20వ దశకంలో బాహ్య ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఈ చారిత్రిక నగరం పురావస్తు తవ్వకాలలో 20వ దశకంలో బయటపడిందని చెప్పారు.

యుగపురుషుడు అగ్రసేన్ మహారాజ్ కేవలం ఆగర్వాల్ సామాజిక వర్గానికే కాకుండా యావత్తు హిందూ సమాజానికి పూజ్యనీయుడని గార్డ్ వివరించారు. అగ్ర భాగవత్ పేరిట ఒక గ్రంథాన్ని అగార్వల్ సమ్మేళన్ తీసుకువచ్చిందని అన్నారు. దేశంలో 14 భాషల్లో ఈ గ్రంథం ముద్రితం అయిందని చెప్పారు.

అగర్వాల్ కుటుంబాలు ఆర్థికంగా నిలబడటానికి చేయూత ఇవ్వడం, వ్యాపారంలో ఆర్జించిన లాభంలో కొంత మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం, అగర్వాల్ ఆరాధ దైవం అగ్రసేన్ మహారాజ్ జయంతిని ప్రతి కుటుంబంలో నిర్వహించడం ఈ మూడు ప్రధాన లక్ష్యాలతో సమ్మేళన్ పని చేస్తుందని వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక, ఒక రూపాయి విరాళంగా ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకున్నారని తెలిపారు. అదే విధంగా వ్యాపారం అగర్వాల్ జాతి లక్షణంగా నిర్ణయించారని చెప్పారు. ఈ క్రమంలోనే రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో వ్యాపారాలు ప్రారంభించారని అన్నారు. అలా మొదలైన అగర్వాల్ వ్యాపార విస్తరణ విశ్వ వ్యాప్తమయిందని తెలిపారు. వారి సంపాదనలో కొంత ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం అనవాయితీగా వస్తోందని గోపాల్ శరన్ గార్డ్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి బాబూలాల్ పొద్దర్, అగర్వాల్ మహా సభ విశాఖపట్నం అధ్యక్షులు బిజేంద్ర కుమార్ గుప్తా, సమ్మేళన్ ప్యాట్రన్స్ సుమన్ ప్రకాశ్ సరోగి, పవన్ కుమార్ కన్సారియా, విజయ్ గుప్తా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వినీత్ లోహియా
అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా వినీత్ లోహియా (విశాఖపట్నం) బాధ్యతలు స్వీకరించారు. కార్యదర్శిగా దీపక్ కన్సారియా (విశాఖపట్నం), కోశాధికారిగా సంజయ్ కుమార్ టిక్మణి (విశాఖపట్నం), ప్యాట్రన్స్ గా సుమన్ ప్రకాశ్ సరోగియా (విశాఖపట్నం), పి.కె.గుప్తా (విశాఖపట్నం), పవన్ కుమార్ కన్సారియా (విశాఖపట్నం), విజయ్ గుప్తా (విశాఖపట్నం), సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ గా బిజేందర్ కుమార్ గుప్తా (విశాఖపట్నం), బాబూలాల్ పొద్దర్ (శ్రీకాకుళం), ఓం ప్రకాశ్ అగర్వాల్ (విజయవాడ), మనోజ్ కుమార్ గుప్తా (తిరుపతి), సంయుక్త కార్యదర్శులుగా అరుణ్ అగర్వాల్ (విశాఖపట్నం), గిరిధారీ లాల్ అగర్వాల్ (విజయనగరం), అశోక్ కుమార్ అగర్వాల్ (కాకినాడ), సుభాష్ చాంద్ గుప్తా (విజయవాడ), సంయుక్త కోశాధికారిగా సంజయ్ అగర్వాల్ (శ్రీకాకుళం), కార్యవర్గ సభ్యులుగా విశాఖపట్నం నుంచి మనీష్ లోహియా, మనోజ్ బన్సాల్, సత్యనారాయణ్ జలాన్, మధుసూధన్ కుమార్ యదుకా, రాజ్ అగర్వాల్, ప్రకాశ్ లాల్ భర్జీయా, రాజేశ్ భర్జీయా, కమల్ అగర్వాల్, సంజయ్ కుమార్ అగర్వాల్, సంజయ్ పరశరామిక, మోహన్ లాల్ అగర్వాల్, మహావీర్ ప్రసాద్ అగర్వాల్, అనీల్ కుమార్ గుప్తా, శ్రీకాకుళం జిల్లా నుంచి మనోజ్ కుమార్ అగర్వాల్, పుల్కిత్ అగర్వాల్, రాజ్ కుమార్ ధనుకా (చీపురపల్లి, కృష్ణ గోపాల్ అగర్వాల్, ఆశీష్ సరల్, సంజయ్ అగర్వాల్ (విజయనగరం), విజయ్ అగర్వాల్ (కాకినాడ), అశోక్ కుమార్ సింఘానియా, పుర్ణామాల్ అగర్వాల్, అజయ్ సింఘాల్, డాక్టర్ అరుణ్ అగర్వాల్ (రాజమండ్రి), శ్యామలాల్ అగర్వాల్ విజయ్ కుమార్ అగర్వాల్, సుశీల్ అగర్వాల్ (విజయవాడ), రవి కుమార్ గోయల్ (తిరుపతి) బాధ్యతలు చేపట్టారు.

Name*
Email*
Comment*