దోమల నివారణపై అవగాహన ర్యాలీ

7/26/2024 9:01:09 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భీమిలి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే ర్యాలీ నిర్వహించారు. ఎగువపేట ముఖద్వారం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ భీమిలి పురవీధుల్లో ముందుకు సాగుతూ ప్రజలందరికీ దోమల వలన కలిగే వ్యాధులు, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భీమిలి జోనల్ కమీషనర్ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ  వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయని వాటిని నివారించడానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు. ప్రజలకు అన్ని విధాల సహకరించడానికి, దోమల నివారణకు తగు సలహాలు, సూచనలు ఇవ్వడానికి తమ సిబ్బంది అనుక్షణం అందుబాటులో ఉంటారని ఆమె తెలియజేశారు. మూడవ వార్డ్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చని, ఇళ్ల పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆమె చెప్పారు. దోమకాటు ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి నాయుడు, మలేరియా ఇన్స్పెక్టర్ సూరిబాబు, జి వి ఎం సి సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*